Tikka Veereswara Swamy | అయిజ పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ జన్మదినం, తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని, రాబోయే రోజుల్లో కేసీఆర్కు పూర్వవైభవం వచ్చేలా ప్రసాదించాలని తిక్కవీరేశ్వరుడిని కోరుకున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో అలంపూర్ బీఆర్ఎస్ సీనియర్ నేత – సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సంకాపురం రాముడు, మాజీ ఎంపీపీలు సుందర్ రాజు, ప్రహ్లాదరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ దేవన్న, మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, మాజీ జెడ్పీటీసీ చిన్న హన్మంతు, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, సీనియర్ నేతలు వావిలాల రంగారెడ్డి, నరసింహారెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డి, రవిరెడ్డి, మాజీ సర్పంచ్లు తిప్పారెడ్డి, హన్మంతురెడ్డి, భద్రయ్య, మాజీ ఎంపీటీసీలు వేణుగోపాల్ రెడ్డి, రాముడు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రవిప్రకాష్, కిశోర్, రామకృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు