బీఆర్ఎస్ హయాంలోనే పల్లెల ప్రగతి
బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అబివృద్ధి చెందాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమావేశ భవన నిర్మాణానికి రూ.15లక్షలతో సోమవారం భూమిపూజ చేశారు.
- రైతుల కోసమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- తాడూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
తాడూరు, మే 15 : బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అబివృద్ధి చెందాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమావేశ భవన నిర్మాణానికి రూ.15లక్షలతో సోమవారం భూమిపూజ చేశారు. మండలంలోని అల్లాపూర్, మేడిపూర్, పొల్మూరు, ఆకునెల్లికుదురు, అంతారం గ్రామాల్లో పలు అబివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. మేడిపూర్‌లో రూ.20లక్షలతో సీసీరోడ్ల ప్రారంభోత్సవం, రూ.10లక్షలతో గ్రామంలో నిర్మించిన మత్స్య సహకార సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. అల్లాపూర్‌లో గ్రామపంచాయతీ భవనం, అంగన్వాడీ భవనం, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, ఆయా కాలనీల్లోని సీసీరోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. పొల్మూరులోనూ గ్రామపంచాయతీ భవనం, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనాన్ని, ఆకునెల్లికుదురులో రూ.50లక్షలతో పాఠశాల భవనానికి భూమిపూజ చేశారు. అంతారంలో దళితబంధు కింద ఏర్పాటు చేసిన కోళ్ల ఫారాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అల్లాపూర్‌లో రూ.5కోట్ల 51లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికవడంతో సర్పంచ్ నిరంజన్, ఉపసర్పంచ్ కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధే లక్ష్యంగా ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని.. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గతంలో బీజేపీ, ఇతర పార్టీలు అధికారంలో ఉండి గ్రామాలను పట్టించుకోలేదని.. వారి హయాంలో రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 30శాతం సీసీరోడ్ల నిర్మాణం పూర్తయిందని, 10శాతం నిధులిస్తే వందశాతం పూర్తవుతాయన్నారు.
రైతులు పండించిన మొక్కజొన్న, ఇతర పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొంటుందనారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, రైతులకు ఇబ్బందులు లేకుండా తడిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే మద్దతు ధరకు కొంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి, వైస్‌ఎంపీపీ శివలీల, సర్పంచులు రమణ, నిరంజన్, కృష్ణవేణి, జయమ్మ, నాగయ్య, యాదమ్మ, ఎంపీడీవో గంగమోహన్, తాసీల్దార్ కార్తీక్‌కుమార్, ఎంపీవో లక్ష్మానాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యార రమేశ్, ప్రధానకార్యదర్శి రాజుగౌడ్, ఎంపీటీసీ సుజాత, నాయకులు తిరుపతిరెడ్డి, మశన్న, కృష్ణయ్య, ప్రసాద్, పరమేశ్వర్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, రాములు, జైపాల్‌రెడ్డి, వెంకటయ్య, అభి, జలీల్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

