అచ్చంపేటరూరల్: ఉమామహేశ్వర దేవాలయ మాజీ చైర్మన్ కందూరి సుధాకర్‌ను ( Sudhakar) ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ( MLA Vamshi Krishna ) సోమవారం సన్మానించారు. విజన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు ఆధ్వర్యంలో సుధాకర్‌కు ఇటీవల భారత్ విభూషణ్( Bharat Vibhusan ) అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను కలిసిన ఆయనను సత్కరించారు. సుధాకర్ నిర్వహించిన పలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఉమామహేశ్వర దేవాలయాన్ని ప్రగతి పథంలో నిలిపినందుకు అవార్డు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు.