ఊట్కూర్, జూలై 1: అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్ స్థానంలో ఉందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అవుస లోనిపల్లి, కొల్లంపల్లి మధ్య ఉన్న సవుటవాగుపై రూ. 36లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే శనివారం భూమిపూజచేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు పట్టణాలకు దీటుగా సుందరంగా మారుతున్నాయన్నారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాల అమలుతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తన హయాంలో ప్రతి గ్రామానికి తారురోడ్డు సౌకర్యం కల్పించామని తెలిపారు. ప్రజలకు ఏ ఆపదవచ్చిన నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందించడమే తన కర్తవ్యమనన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెట్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, సర్పంచ్ హన్మంతు, ఎంపీటీసి భీమమ్మ, మాజీ సర్పంచ్ శివరాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, జూలై 1: రాష్ట్రంలో ప్రతిఒక్కరూ సంపూ ర్ణ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం సహాయనిధి పథకాన్ని అమలు చేస్తున్నారని ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వారికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులనుశనివారం ఎమ్మెల్యే తన నివాస గృహంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ నిధులు మంజూ రు చేయడం జరుగుతుందన్నారు. మక్తల్ మండలం ఎర్నాగన్పల్లికి చెందిన దామోదర్‌రెడ్డికి రూ.60 వేలు, నర్వ మం డలం లంకాల గ్రామానికి చెందిన నర్సప్ప రూ.34వేలు, పుష్ప రూ.17వేలు, మైబుకు రూ.11వేలు మంజూర య్యాయని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కలిసికట్టుగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బవసార్ కాలనీలో శనివారం ఆయన ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ మానవ జన్మకు సార్థకత లభించాలంటే ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. బవసార క్షత్రీయ సంఘం నాయకులు కాలనీకి ప్రహరీ నిర్మించాలని కోరగా రూ. 5 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఎమ్మెల్యే ను సన్మానించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రామకృష్ణ రావు, కోశాధికారి సత్యనారాయణ, కమిటీ సభ్యులు, నర్సింహారావు, నారాయణరావు, లక్ష్మణ్, బాబురావు, రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు.