మాగనూర్, జనవరి 25: రైతులు సొంత డబ్బులతో టేకు మొక్కలు తెచ్చుకుంటే ఉ పాధి హామీ లెక్కల్లో ఎలా రాస్తారని ఏపీవో సత్యప్రకాశ్పై ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మండలకేంద్రంలో ఎంపీపీ శ్యామలమ్మ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే చిట్టెం, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భం గా సర్పంచులు, ఎంపీటీసీల సమక్షంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తమ నివేదికలను చదివి వినిపించారు.
ఏవో మాట్లాడుతూ ఇప్పటివరకు 26మంది రైతులు మృతిచెందగా 21మంది కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నామినీ ఖాతాలో జ మ చేశామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళాసంఘాలకు రుణాలు ఇవ్వడంలో.. ఎంపిక చే యడంలో ఏకపక్షం వ్యవహరించడం ఏం టని ఏపీఎం రామలింగంపై ఆగ్రహం వ్య క్తం చేశారు. రైతులు తమ సొంత డబ్బుల తో టేకు మొక్కలు తెచ్చుకొని పొలాల్లో నా టుకుంటే ఉపాధి లెక్కల్లో ఎలా రాస్తారని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు.
అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో నీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు అదేశించారు. నేరడగం జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎంపీటీసీ ఎల్లారెడ్డి తెలిపా రు. అ నంతరం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులు, ప్ర జాప్రతినిధులతోకలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశా రు. కా ర్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటయ్య, వైస్‌ఎంపీపీ తిప్పయ్య, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఇం చార్జి తాసిల్దార్ అమీర్ పాల్గొన్నారు.