ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. అమరచింత తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం క్రైస్తవులకు క్రిస్మస్ కిట్లను పంపిణీ చేశారు.
- క్రిస్మస్ కిట్ల పంపిణీలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
అమరచింత, డిసెంబర్ 23 : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. అమరచింత తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం క్రైస్తవులకు క్రిస్మస్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ సంతోషంగా పండుగలను జరుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏడాది దుస్తులను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కౌన్సిలర్ సింధువిజయ్ ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో భారీగా చేరిక
పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో 60మంది బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్ నేతృత్వంలో కౌన్సిలర్లు చెన్నయ్య, పోశన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరిన కార్యకర్తలకు ఎమ్మెల్యే చిట్టెం గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రియాదవ్, వైస్‌చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

