చిన్నంబావి, నవంబర్ 21 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయని, సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని కొల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవా రం చిన్నంబావి మండలకేంద్రంతోపాటు లక్ష్మీపల్లి, చెల్లెపాడు, అయ్యవారిపల్లి, కాలూరు, వెల్టూరు, చిన్నమారుర్ గ్రామాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్‌రావు, మండల నాయకులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామాల్లోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీరం మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ సారథ్యంలో రైతుల గోసను తీర్చేందుకు ఉచిత విద్యుత్, సాగునీరును తీసుకురావడంతో నేడు వ్యవసాయం ఒక పండుగలా మారిందని, గతంతో పోల్చుకుంటే వందశాతం సాగు పెరిగి రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.
సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికీ అం దాయని, పార్టీలకతీతంగా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అ న్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. అదేవిధంగా కులవృత్తులకు ప్రోత్సాహాన్ని అందిస్తు అర్థికంగా అభివృద్ధి చెందేందుకు పాటుపడుతున్నారన్నారు. రాష్ర్టాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేసి దేశంలో నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. కాంగ్రెస్ నాయకుల మోసపూర్తిమైన మాట లు నమ్మి మోసపోవద్దన్నారు. కేవ లం ఓట్ల సమయంలోనే ప్రతిపక్షాల నాయకులు కనిపిస్తారని, ఓట్లు అయిపోయాక ఐదేండ్ల వరకు కనిపించకుండా పోతారన్నారు. ప్రజల మధ్య ఉండి మీ కోసం పనిచేసే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించి కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. అదేవిధంగా 98 జీవో గురించి మా ట్లాడే నైతిక హక్కు కొల్లాపూర్ మాజీ నాయకులకు లేదన్నారు.
19 ఏండ్లు అధికారంలో ఉండి చెల్లని జీవోలతో కాలం గడిపారన్నారు. తె లంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే సింగోటం గోపల్‌దిన్నె లిం కు కెనాల్ పూర్తి చేసి రైతులకు ఇ బ్బందులు లేకుండా సాగునీటిని అందించామని, గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సమస్యలు లేకుండా చేశామన్నారు. సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే బీఆర్ఎస్ ప్రభుతాన్ని ఎన్నుకోవాలన్నా రు. అనంతరం ఆయన ప్రజలను కలిసి ఎన్నికల మ్యానిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వివరిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. కార్యక్రమం లో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రామమ్మ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మధు, నాయకులు గోవింద్ శ్రీధర్‌రెడ్డి, దారాసింగ్, ఇంద్రసేనారెడ్డి, చిన్నారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, వడ్ల రాజు, తిరుపాలు, నరసింహ, రామస్వామి, సుధాకర్‌రెడ్డి, డేగ శేఖర్, ఉగ్ర నరసింహా, జేకే నా యు డు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, పార్టీ అధ్యక్షుడు, కార్యకర్తలు, అభిమాను లు, యువకులు ఉన్నారు.