గద్వాల, జనవరి 23 : ప్రభుత్వం పేదలకు అం దించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గట్టు మం డలం ఇందువాసి గ్రామానికి చెందిన శారదమ్మ వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్షాయాభైవేల ఎల్వోసీని మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు అనారోగ్యానికి గురై చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నవారు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే వైద్యఖర్చులకు అవసరమైన డబ్బును సీఎం సహాయనిధి ద్వారా అందిస్తారన్నారు.
అనంతరం క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోషియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు కృష్ణారెడ్డి, విష్ణు, తిక్కన్న, శ్రీనివాస్‌రెడ్డి, రవి, నోడల్ అధికారి హృదయరాజు, ప్రిన్సిపాల్ వీరన్న, అధ్యాపకులు కురుమూర్తి, కలీముల్లా, వెంకటకృష్ణారెడ్డి, మహేందర్, రాజేందర్, నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.