గద్వాల, జూన్ 13 : ప్రభుత్వం అందించే సాయాన్ని ప్ర జలు సద్వినియోగం చేసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. గురువారం జిల్లా కేం ద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గద్వాల పట్టణం వేదనగర్కు చెందిన శ్రీనివాసులుకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.లక్ష ఎల్వోసీని బాధిత కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అనారోగ్యానికి గురై చికిత్స చేయించుకోలేని వారు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సాయం అందుతుంద న్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ ఈరన్గౌడ్, వేణు పాల్గొన్నారు.