అయిజ, సెప్టెంబర్ 11 : నెట్టెంపాడ్ ప్రాజెక్టు పరిధిలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ కరకట్టను పటిష్టం గా చేపట్టాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అ ధికారులను ఆదేశించారు. బుధవారం గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను అయిజ మం డల బీఆర్ఎస్ నేతలు, రైతులు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే విజయు డు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తున్నదని, 150 మీటర్ల పొడవు, 4 అడుగుల మేర కరకట్ట పూ ర్తి చేయాల్సి ఉన్నది.
రిజర్వాయర్ నిండుగా మారడంతో కట్ట తెగితే అయిజ మండలంలోని టీటీదొడ్డి, కొత్తపల్లి, సింధనూర్ గ్రామాల పరిధిలోని భూము ల్లో పంటలు నీట మునగడంతోపాటు భూములు కోతకు గురయ్యే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అధికారులకు వివరించారు. ఇప్పటికే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితోపాటు తాను కట్ట పటిష్టతపై అధికారుల దృష్టికి తీ సుకెళ్లామన్నారు.
పెండింగ్‌లో ఉన్న కరకట్ట పనులు ఏ మేరకు జరిగాయో చెప్పాలన్నారు. సాధ్యమైనం త త్వరగా కరకట్ట పనులు పూర్తి చేసి దిగువ ప్రాం తాల రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరమున్నదన్నారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి ఆర్డీఎస్ లింక్ కెనాల్ పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కోరారు. 99, 100 ప్యాకేజీ కింద రిజర్వాయర్ నుంచి అయిజ మండలంలోని సింధనూర్ సమీపంలో ఆర్డీఎస్ కెనాల్‌కు లింక్ కెనాల్ ఏర్పాటు చేస్తే ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అం దించే అవకాశం ఉందన్నారు. 6 కిలోమీటర్ల లింక్ కెనాల్ కోసం ఎమ్మెల్సీ చల్లా సీఎం రేవంత్‌రెడ్డికి ప్ర తిపాదించారని, గతంలో పంపిన ప్రతిపాదనలు ఇ రిగేషన్ ఉన్నతాధికారులు త్వరగా పంపేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు.
కర్ణాటకలోని ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ నుంచి నీటి విడుదల నిలిచిపోతే చిన్నోనిపల్లి లింక్ కెనాల్ ద్వారా ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీ రు విడుదల చేయడానికి ఆస్కారం ఉందన్నారు. ఇ టీవల కురిసిన వర్షాలకు తెగిన రోడ్లు, చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రా ముడు, మాజీ జెడ్పీటీసీ చిన్న హన్మంతు, నేతలు రంగారెడ్డి, నర్సింహారెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, ఉమేశ్ గౌడ్, శివకుమార్, డైరెక్టర్ హుస్సేని, బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు పల్లయ్య, రైతులు పాల్గొన్నారు.