భూత్పూర్, (అడ్డాకుల) జూలై 2 : రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం పక్కా అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొనారు. యువత రాజకీయాల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. అడ్డాకుల మండలం కాటవరం గ్రామంలో జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం యువజన సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ముందుగా ఉద్యమ కళాకారుడు సాయిచంద్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని తెలిపారు. ఎడారిగా ఉన్న పాలమూరు నేడు సాగునీటి రంగంలో ఎంతో ప్రగతి సాధించిందన్నారు. ఉద్యమంలో యువకుల పాత్రను గుర్తించి.. తన నియోజకవర్గంలో ఎక్కువగా సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ పదవుల్లో యువకులకే అవకాశాలు కల్పించామన్నారు.
గతంలో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో దాదాపు 1,500 మంది పాల్గొనడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్శితులై ఎమ్మెల్యే సమక్షంలో అడ్డాకుల, కాటవరం, రాచాల, కన్మనూరు గ్రామాలకు చెందిన యువకులు వివిధ పార్టీల నుంచి 150మంది బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో కొత్తగా చేరిన వారితో పాత నాయకులు కలుపుకొని ముం దుకు సాగాలని సూచించారు. పార్టీలో చేరిన వా రిలో రామస్వామి, కావలి సురేశ్, శివయాదవ్, తిరుపతి, కురుమూర్తి, వివేకానంద, సాయికుమార్ తదితరులున్నారు. అనంతరం యువత విభాగం కమిటీ ఎమ్మెల్యేను గజమాలను సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జునరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, యువత విభాగం అధ్యక్ష, కార్యదర్శులు బాలరాజు, మహేశ్‌యాదవ్, సింగిల్‌విండో చై ర్మన్ జితేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండ ల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మదనాపురం మా ర్కెట్కమిటీ చైర్మన్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఖాజాఘోరీ తదితరులు పాల్గొన్నారు.