మూసాపేట, నవంబర్ 6 : పాలమూరు ఎంపీగా ఎన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మన గోసలు చూసిండని, సీఎం అయిన వెంటనే అడిగిన వెంటనే నిధు లు మంజూరు చేస్తూ కరువును తరిమిన దైవం మన కేసీఆర్ అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కొనియాడారు. సోమవారం దేవరకద్ర లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఈ ప్రాంత ప్రజలను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. వాగులు, వంక లు, చెరువులు కుంటలు అన్నీ ఎండిపోయి మనుషులకు, జంతువులకు కూడా తాగునీరు ఉండేది కాదన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో చెక్‌డ్యాంలు, ప్రాజెక్టులు, కాల్వలు, రోడ్లు, భవనాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనుకున్న దానికంటే ఎక్కువనే అభివృద్ధి చేసినట్లు చెప్పారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు సాగునీటికి చెక్‌డ్యాంల నిర్మించుకోవడం వలన పుష్కలంగా పంటలు పండించుకుంటున్నట్లు చెప్పారు.
ప్రతి పల్లె నేడు సస్యశామలం అయ్యిందని, కరువుపోయి మన వద్దకు ఇతర రాష్ర్టాల నుంచి బతకడం కోసం కూలీలు వస్తున్నారని గుర్తు చేశారు. మీమీ గ్రామాల్లో నేను చేసిన అభివృద్ధిని, ప్రభుత్వం ద్వారా అందుకున్న సంక్షే మ పథకాలను చూసి కారు గుర్తుకు ఓటు వేసి మరో మారు రెట్టింపు మెజార్టీతో గెలిపిస్తే దేవరకద్రను మరింత అభివృద్ధి చేసుకుందామని ప్రజలను సూచించారు. ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞుడై ఉంటూ మీ సేవ చేస్తానని సభాముఖంగా ప్రకటించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధిని కల్పించాలని కోరారు. అదేవిధంగా కౌకుంట్లలో నుంచి అడ్డాకుల వరకు డబుల్ రోడ్డు, వంతెన నిర్మాణానికి నిధులు మం జూరు చేయాలని, దేవరకద్రలో పాల్టెక్నిక్ కళాశాల మంజూరు చే యాలని, కురుమూర్తిస్వా మి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, అదేవిధంగా నియోజకవర్గంలోని ఆయా మండలాలకు సం బంధించి కావాల్సిన వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. అందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ మీ చెక్‌డ్యాంల ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని 50 వేల మెజార్టీ తగ్గకుండా గెలిపించాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మంజూరు చేసుకుందామని చెప్పారు.
దేవరకద్ర, నవంబర్ 6 : ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం దేవరకద్ర నియోజవర్గకేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభ సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ హెల్ప్యాడ్లో దేవరకద్రకు చేరుకోగానే మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నే శ్రీనిస్గౌడ్, మాజీ స్పీకర్ మదుసూదనాచారి, మాజీ మంత్రలు నాగం జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.