భూత్పూర్, జనవరి 29 : ప్రభుత్వం పేదలకు ఎల్లప్పు డూ అండగా ఉంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అన్నాసాగర్‌కు చెంది న శేఖర్‌కు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.2లక్షల ఎల్వోసీని ఆదివారం ఎమ్మెల్యే ఆల అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్యం ఇతర కారణాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు ఖాజా, బీఆర్ఎస్ నాయకులు షాకీర్, శివరాజు తదితరులు పాల్గొన్నారు.