దేవరకద్ర/భూత్పూర్/కొత్తకోట, నవంబర్ 9 : నియోజకవర్గంలో అభివృద్ధికి పాటుపడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని దేవరకద్ర బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం అన్నాసాగర్‌లోని తన నివాసంలో తల్లి వరలక్ష్మి పాదాలకు వందనం చేసి వెళ్లారు. అలాగే సోదురుడు ఆల శశివర్ధన్‌రెడ్డి, అక్క గీతతో ఆశీర్వాదం తీసుకున్నారు. కొత్తకోట మండలం పామాపురం భక్తాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబ సమేతంగా నామినేషన్ దాఖలు పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ దాఖలు పత్రాలపై ఆలయ ప్రాంగణంలో సంతకాలు చేశారు. దేవరకద్ర ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం పట్టణ పురవీధుల గుండా నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్లకు ముందు నియోజకవర్గంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమయ్యారన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అతి తక్కువ సమయంలో ఊహించని అభివృద్ధి సాధించామన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తన గెలుపునకు నాంది అన్నారు. అనంతరం ఆల రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎంపీపీలు రమాదేవి, గుంతమౌనిక, హర్షవర్ధన్‌రెడ్డి, కదిరె శేఖర్‌రెడ్డి, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, నాయకులు ప్రదీప్‌కుమార్‌గౌడ్, కర్ణంరాజు, నరసింహారెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, వెంకటేశ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.