దేవరకద్ర, సెప్టెంబర్ 22 : పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోనే మొదటిసారిగా మండలంలోని డోకూర్లో లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 3వేల మందికి గృహలక్ష్మి పథకం కింద మంజూరు కాగా 219మందికి ప్రొసీడింగ్‌లు అందజేశామన్నారు. నియోజకవర్గంలో అర్హులందరికీ ప్రొసీడింగ్‌లు అందజేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే తెలంగాణ వచ్చాక రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం డోకూర్లో రూ.20లక్షలతో చేపట్టనున్న ప్రాథమిక ఉపకేంద్ర భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అదేవిధంగా రూ.1.5లక్షలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు.
అక్టోబర్ 4న మంత్రి హరీశ్‌రావు రాక
వంద పడకల దవాఖాన నిర్మాణానికి దేవరకద్ర పట్టణ సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని శుక్రవారం ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దవాఖాన నిర్మాణానికి రూ.35కోట్లు మంజూరు చేసిందని, భూమిపూజ చేసేందుకు అక్టోబర్ 4న మంత్రి హరీశ్‌రావు వస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా శంకుస్థాపన, సభా ప్రాంగణానికి స్థలాన్ని పరిశీలించారు. గద్దెగూడెం నుంచి కోటకదిర వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేసినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ రమాశ్రీకాంత్యాదవ్, జెడ్పీటీసీ అన్నపూర్ణ, మండల ప్రత్యేకధికారి రవీంద్రనాథ్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీనివాసులు, సహకారసంఘం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ సూజాత, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖదీర్ పాషా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.