మక్తల్, మే 6 : మంత్రి వాకిటి శ్రీహరి కాన్వాయ్‌లోని వాహనం బోల్తా పడిన సంఘటన మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామ స్టేజి సమీపంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్ర త్యక్ష సాక్షులు అందించిన సమాచారం ప్రకారం.. మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గంలోని,
ఊటూరు మండలం మల్లేపల్లిలో బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వెళుతున్న క్రమంలో మండల పరిధిలోని ఉపర్పల్లి స్టేజీ సమీపంలో మంత్రి కాన్వాయ్‌లోని బాంబు స్వాడ్ వాహనం ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. దీంతో వాహనంలోని నలుగురు సిబ్బందికి గాయాలు కాగా వారిని మంత్రి ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం జిల్లా దవాఖానకు తరలించారు.