మహబూబ్‌నగర్ టౌన్, నవంబర్ 7 : ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందించి సీఎం కేసీఆర్ సుపరిపాలన అందించారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 18, 38వ వార్డు కమలా నెహ్రూకాలనీ, ప్రేమ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గీతా హోటల్ నుంచి మం త్రికి వార్డు ప్రజలు, కౌన్సిలర్లు, మ హిళలు ఘన స్వాగతం పలికారు. వీధుల్లో పాదయాత్రలో జనం పెద్ద ఎత్తున మంత్రితో కలిసి నడిచారు. ప్రేమ్‌నగర్‌లో మంత్రి మాట్లాడుతూ 60ఏండ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్ అందించలేని దౌర్భాగ్యపు పరిస్థితులను అనుభవించామన్నారు. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణ అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లేందుకు మోసపూరిత హామీలతో వస్తున్నారని, వారిని నమ్మితో గోసపడడం ఖాయమన్నారు. నిరంతరం మీతోనే ఉండి సేవకుడిలా పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతే పాలమూరు పచ్చబడిందన్నారు. తాగు, సాగునీటితో పాటు పట్టణంలో ఎవరూ ఊహించని అభివృద్ధి చేశామన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలంతా ఆదరిస్తున్నారని, సీఎం కేసీఆర్ చెప్పాడంటే చేసిచూపిస్తారన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేవలం ఓట్ల రాజకీయం చేస్తున్నారని, ఎన్నికల తర్వాత వారు అడ్రస్ లేకుండా పోతారన్నారు. అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని కోరారు. మహబూబ్‌నగర్ పట్టణాన్ని ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దామని, హైదరాబాద్ తరహాలో రూపుదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం 37వ వార్డు పరిధిలోని సద్దల గుండు, రై ల్వేస్టేషన్ ఏ రియా, 39వ వా ర్డు రాజేంద్రనగర్‌లో ఎన్నికల ప్ర చారం నిర్వహించారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, కౌన్సిలర్లు, కిశోర్, బాలీశ్వరి, నాయకులు హ నీఫ్అహ్మద్, ఇక్బాల్, వాహెద్తాజ్, స మద్ఖాన్, రాంచందర్‌జీ, పుర్ణచందర్, వెంకట్రాములు, సాయిలు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని 37వ వార్డు సద్దలగుండు, రైల్వేస్టేషన్, 39వ వార్డు రాజేంద్రనగర్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌కు అడుగడుగునా జననీరాజనం పలికారు. గజమాలతో సన్మానించారు. వేలాది మంది ప్రచారం ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, నాయకులు సాయిలు, హనీఫ్ అహ్మద్, జావిద్‌బేగ్, రాజశేఖర్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 7 : జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయం లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు బీఆర్ఎస్లో చేరారు. జిల్లా కేంద్రంలోని 9వ వార్డు భాగ్యనగర్ కాలనీకి చెందిన బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 50 మంది బీజేపీ నాయకులు, కౌన్సిలర్ ఎండీ ఖాజాపాషా ఆధ్వర్యంలో మోటర్‌లైన్ మెయిన్ కమిటీ అసోసియేషన్ సభ్యులు సయ్యద్ సోయబ్ హుస్సేన్, ఫరీద్, ఇలియాన్, షఫీ, ఫయాజ్‌తోపాటు 50 మంది, అలాగే మహబూబ్‌నగర్ మం డలం దివిటిపల్లికి చెందిన సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో చెన్నయ్య, కృష్ణ, ఆంజనేయులు, బాలరాజుగౌడ్, వెంకటయ్య, మల్లేశ్, శ్రీనివాసులు, మమత, అరుణ, రంజాన్బీతోపాటు 30మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.