ఉమ్మడి జిల్లాలో చదువుల పండుగ అట్టహాసంగా జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవం అంబరాన్నంటేలా నిర్వహించారు. ఊరూరా ఉత్సాహంగా జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వనపర్తి, రేవల్లి, గోపాల్పేట మండలాల్లో జరిగిన ఉత్సవాల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఒకరోజు ఉపాధ్యాయుడిగా వ్యవహరించి విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పాలమూరులోని శిల్పారామంలో జరిగిన కార్యక్రమానికి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు.
నెట్వర్క్ మహబూబ్‌నగర్, జూన్ 20 : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం విద్యాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, ప్రజాప్రతి నిధులు ఆయా గ్రామాల్లో ర్యాలీ తీశారు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యా యులు, నాయకులు యూనిఫాం, పాఠ్యపు స్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా అల్పాహారం గా రాగి జావ అంద జేశారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివా స్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఆల, బండ్ల, అబ్రహం, మర్రి, చిట్టెం, పట్నం, గువ్వల, బీరం, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.