పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై గురువారం ఆలయ కమిటీ సభ్యులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శాంతా నారాయణ గౌడ్ స్మారక టోర్నమెంట్‌ను, 23వ వార్డులో కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన్యంకొండ ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయడంలో భాగంగా వారికి ఆహ్వానం పంపాలన్నారు. సర్కార్ క్రీడలకు పెద్దపీట వేసిందని, పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు పురస్కారాలు అందజేస్తున్నామన్నారు.
పాలమూరు, జనవరి 27 : మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మన్యంకొండ బ్రహ్మోత్సవాల నిర్వహణపై గురువారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న మన్యంకొండ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి కేబుల్ కారును ఆలయం వద్ద నిర్మిస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం పంపాలన్నారు. స్వామివారి పుష్కరిణి, శానిటైజింగ్, పార్కింగ్, లైటింగ్, వాటర్ సైప్లె, రవాణా సదుపాయాలు కల్పించాలన్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చే ఏడాదికల్లా భక్తులకు శాశ్వత ఏర్పాట్లు కల్పిస్తామన్నారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను మంత్రి విడుదల చేశారు. సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు తేజాస్ నందలాల్‌పవార్, సీతారామారావు, ఎస్పీ నరసింహ, ఎస్పీ రాములు, డీఎస్పీ మహేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మన్యంకొండ ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్, దేవాదాయ శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరాజు, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, తాసిల్దార్ పాండునాయక్, ఆర్ఐ క్రాంతికుమార్‌గౌడ్, ఎంపీడీవో జ్యోతి, ఎంపీవో నరేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.