మహబూబ్‌నగర్, డిసెంబర్ 25 : యేసుక్రీస్తు ఆశీస్సులతో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మోతీనగర్ బెతెస్తా హోలీ, పాత బస్టాండ్ సమీపంలోని ఎంబీసీ, క్రిస్టియన్‌పల్లి ఎంబీ చర్చిల్లో క్రిస్మస్ వేడుకలకు మంత్రి హాజరై పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముందు వరుసలో నిలుపుతామన్నారు. క్రిస్టియన్, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. గతంలో పండుగ వస్తే పట్టించుకునే వారే ఉండేవారు కాదని, కానే అన్ని మతాల పండుగలకు ప్రభుత్వం కానుకలను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, పాస్టర్ రెవరెండ్ వరప్రసాద్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్ రాజురాణి, కోఆప్షన్ సభ్యులు వరలక్ష్మి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వదేశ్, క్రిష్టియన్ మైనార్టీ అధ్యక్షుడు డేవిడ్, ఫాదర్ పృథ్వీరాజ్, పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించి సింగిల్ పర్మిట్ విధానం అమలుకు కృషి చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర లారీ యజమానుల సంఘం నాయకులతో మంత్రి మాట్లాడారు. రెండు రాష్ర్టాల యజామానులకు ఇబ్బందికరంగా మారిన ప్రధాన సమస్య సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్‌తో చర్చించి పరిష్కరిస్తామన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో మంత్రి ఫోన్లో చర్చించారు. లారీ డ్రైవర్స్, యజమానులకు వేధింపులు లేకుండా చేస్తామని తెలిపారు. టీఎస్ఎండీసీ ఇసుక పాలసీలో ఓవర్ లోడ్ అంశంలో కాంట్రాక్టర్లు, ఇసుక యజమానులకు మధ్య ఉన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, పాస్టర్ రెవరెండ్ వరప్రసాద్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు, క్రైస్తవులు, లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంచి రెడ్డి రాజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చాంద్‌పాషా, సభ్యులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 25 : రాష్ట్రంలోని అన్ని కులాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో రూ.10 లక్షలతో వేసిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. అలాగే ఎదిరలో రూ.5 లక్షలతో నిర్మించనున్న రజక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని మతాలకు సమప్రాధ్యానతనిస్తూ రాష్ర్టాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. రజకులకుఅధునాతన దోభీఘాట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్నికులాలు, మతాలవారు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఎదిరలో ఐటీ పార్కు ఏర్పాటు చేశామని, భూములు కొల్పోయిన వారికి డబ్బులు ఇచ్చి అండగా నిలిచామన్నారు. హైదరాబాద్ తరహాలో పాలమూరును అభివృద్ధి చేస్తామన్నారు. అందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి సహకరించాలని స్వాములు కోరగా.. మంత్రి రూ.5 లక్షలను విడుదల చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్లు కట్టారవికిషన్‌రెడ్డి, యాదమ్మ, నాయకులు శివశంకర్, హన్మంతు, సూద నర్సింహ, ఎల్లయ్య, హకీం, బీకే రాములు, నారాయణ, శ్రీనివాసులు, తిరుపతయ్య, రవిశంకర్, రాములు, శేఖర్, బాను, సత్యం తదితరులు పాల్గొన్నారు.