ఉండవెల్లి, ఫిబ్రవరి 21 : మండలంలోని మారమునగాల-2 గ్రామంలో నిర్వహిస్తున్న సుంకులమ్మ దేవర ఉత్సవాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. సుంకులమ్మకు పూజలు చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆహ్వానం మేరకు తేనేటి విందులో మంత్రి పాల్గొన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే అబ్రహం, ప్రజాప్రతినిధులు ఉన్నారు.