వనపర్తి, మార్చి 15: అభిమానులను, శ్రేయాభిలాషుల కుటుంబాలను ఒకేచోట కలుసుకోవడం సంతోషంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ ఆలయం వద్ద ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, అబ్రహం, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభీవాణీదేవి, రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి అమ్మవారికి మంత్రి నిరంజన్‌రెడ్డి, కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో అమ్మవారికి మొక్కు చెల్లించలేదని, ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలతో కలిసి మొక్కు చెల్లించి ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 10వేలమందితో అమ్మవారి ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోగా, కరోనా నేపథ్యంలో ఎక్కువమందిని కలువలేకపోయాయని, ఇప్పుడు ఇంతమందిని కలుసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు బండారు భాస్కర్, నియోజకవర్గ ప్రజా ప్రతినిథులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.