వనపర్తి, ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో మార్పు కోసం పాటుపడాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానీయుడు జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను పాటించాలన్నారు.
దేశసేవ చేయానే కోరిక ఉన్నవారు మహనీయులను స్మరించుకోవాని సూచించారు. ఎస్పీ రక్షితామూర్తి మాట్లాడుతూ సమాజసేవకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, మార్కెట్‌కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, ఎస్సీ సంక్షేమ అభివృద్ధిశాఖ అధికారి నుషిత, ఉత్సవకమిటీ సభ్యులు లక్ష్మయ్య, వెంకట్రాములు, ఎర్రవల్లి భాస్కర్, కోళ్ల వెంకటేశ్, ప్రజాప్రతినిథులు, అధికారులు పాల్గొన్నారు.