ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్మించిన వే సైడ్ మార్కెట్‌ను సిన్జెంటా సీఈవో ఎరిక్ ఫైర్వాల్డ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంస్థ సహకారం ఎనలేనిదన్నారు.
వనపర్తి, మార్చి 2: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట శివారులో ఉన్న మెడికల్ కళాశాల సమీపంలో సిన్జెంటా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన వే సైడ్ మార్కెట్‌ను గురువారం సందర్శించారు. సిన్జెంటా సంస్థ గ్లోబల్ సీఈవో ఎరిక్ ఫైర్వాల్డ్తో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్ర పాలనలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నా రు. అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రజలు వ్యవసాయ రంగంమీద ఆధారపడి ఉన్నారని, అలాంటి రంగాన్ని ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.
దేశవ్యాప్తంగా అగ్రికల్చర్ కళాశాలలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో తొలి మహిళా వ్యవసాయ కళాశాలను ముఖ్యమంత్రి చొరవతో వనపర్తిలో ఏర్పాటు చేశామని, త్వరలోనే సొంత భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సిన్జెంటా సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 24 వే సైడ్ మార్కెట్లను ఏర్పాటు చేసిందని, రాష్ట్రంలో తొలి వే సైడ్ మార్కెట్‌ను రూ.3.40 కోట్లతో వనపర్తిలో నిర్మించడం సంతోషించదగ్గ విషయమన్నారు. వే సైడ్ మార్కెట్‌కు దగ్గరలో ఉన్న రైతులు కూరగాయలు, పండ్లను విక్రయించి ఆదాయం సంపాదించుకోవాలన్నారు. మార్కెట్‌కు వచ్చే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, పిల్లలను చూసుకునేందుకు ఆయా, ఆటవస్తువులు, క్యాంటీన్ సైతం అందుబాటు లో ఉందన్నారు. జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ యార్డ్‌లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ పనులు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
అనంతరం సిన్జెంటా సంస్థ గ్లోబల్ సీఈవో ఎరిక్ ఫై ర్వాల్డ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదర్శవంతమైన మార్కె ట్ నిర్మించేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి అందించిన సహకారం ఎనలేనిదన్నారు. చిరు వ్యాపారులకు అండ గా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో తొలి వే సైడ్ మార్కెట్‌ను వనపర్తిలో ఏర్పాటు చేశామన్నారు. అనంతరం సిన్జెంటా సంస్థ సభ్యులను మంత్రి నిరంజన్‌రెడ్డి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో అలంపూ ర్ ఎమ్మెల్యే అబ్రహం, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, కౌన్సిలర్ భాష్యానాయక్, సిన్జెంటా సంస్థ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఊహించని అద్భుతాలు సృష్టించాం..
వనపర్తికి మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు వస్తాయని ఎవరూ ఊహించలేదని, అలాంటి అద్భుతాలను నిజం చేసి చూపించామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి మెడికల్ కళాశాలను మంత్రి సందర్శించి విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకొని విద్యార్థులతో ముచ్చటించారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలోని గరుడ పుష్కరిణిని అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్కు సూచించారు. అంతకుముందు మెడికల్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
దేవుడు అవకాశం ఇస్తే చిన్నప్పటి నుంచి మళ్లీ చదువుకోవాలని ఉందన్నారు. గతంలో చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. మెడికల్, ఫార్మసీ, నర్సింగ్ విద్యార్థులకు శాశ్వత సౌకర్యాలు సమకూర్చామన్నారు. మెడికల్ కళాశాల వసతి గృహాలను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మెడికోలను ప్రశ్నలు అడిగి.. సమాధానాలు చెప్పిన వారికి నగదును అందజేశారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సునందిని, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ నరేంద్రకుమార్, వైద్యుడు రాజ్‌కుమార్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.