వనపర్తి రూరల్, ఏప్రిల్ 26 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పరిపాలనతోనే ప్రతి ప ల్లె పురోగాభివృద్ధి సాధిస్తున్నదని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి వనపర్తి మండలం అప్పాయిపల్లి, గుంత, కీర్య, మన్యతండాలో మంత్రి పల్లెనిద్ర చేశారు. బుధవారం ఉదయం ఆయా తండాల్లో మార్నింగ్ వాక్ నిర్వహించి గిరిజనుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్పాయిపల్లి నుంచి తండా వరకు రూ.2.5 కో ట్లతో చేపట్టిన బీటీ రోడ్డును, హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలను అందించామని, అలాగే నిధులు కేటాయించి ప్రతి ఊరు అభివృద్ధి బాటలో ప యనించేలా చేశామన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల స్వరూపమే మారిపోయిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తండాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నదని చెప్పారు. పల్లె, పట్టణ ప్రగతితో సమస్యలు దూరమై నేడు సుందరంగా.. ఆదర్శంగా మారాయన్నారు. ప్రతి పంచాయతీ, మున్సిపాలిటీలో హరితహారం, పల్లె ప్రకృతి వనాలతో కొత్త శోభ సంతరించుకున్నదని పేర్కొన్నారు. సుదీర్ఘంగా తిష్టవేసిన సమస్యలు దూరమయ్యాయని చెప్పారు. వైకుంఠధామా లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో గ్రామాల్లో మురుగు బాధలు తప్పాయని వివరించారు. తెలంగాణ పల్లెల మాదిరి దేశంలో మరెక్కడా లేవన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మన పల్లెలకు ఇచ్చిన జాతీయ పురస్కారాలే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచులు పార్వత్వమ్మ, లక్ష్యమ్మ, అనిత, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ చైర్మన్ రమేశ్‌గౌడ్, బీఆర్ఎస్ శిక్షణ తరగుతుల జిల్లా కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, గొర్రెల కాపరుల సంఘం కన్వీనర్ కురుమూర్తి యాదవ్, మండల అధ్యక్షుడు మాణిక్యం, రైతుబంధు సమితి మండల అ ధ్యక్షుడు నరసింహ, సహకార సంఘాల చైర్మన్లు వెంకట్రావు, రఘువర్ధన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.