పెబ్బేరు రూరల్, డిసెంబర్ 28 : విద్యా బోధన ఎ లా సాగుతున్నది..? మధ్యాహ్న భోజనం రుచిగా ఉం టుందా..? అని విద్యార్థులను వ్యవసాయ శాఖా మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం పెబ్బేరు మండలం సూగూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మంత్రి చిట్‌చాట్ నిర్వహించారు. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి పలు ప్రశ్నలను విద్యార్థులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.
సమాధానాలు చెప్పిన వారికి నగదు బహుమతులు అందజేశారు. ప్రతి విద్యార్థి పరిశుభ్రత పాటించాలని సూచించారు. విద్యార్థులకు చేతిరాత పోటీలు నిర్వహించి తనకు సమాచారమిస్తే వారికి నగదు బహుమతులు పంపుతానని ఉపాధ్యాయులకు సూచించారు. జనరల్ నాలెడ్జ్‌లో విద్యార్థులను చురుకుగా తయారు చేయాలని ఆదేశించారు. అంతకుముందు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మంత్రి చేశారు. రూ.15 కోట్లతో చేపట్టబోయే పెబ్బేరు-వనపర్తి ప్రధాన రహదారి విస్తరణ పనులకు కంచిరావుపల్లి వద్ద శంకుస్థాపన చేశారు.
కొత్తసూగూరులో అంగన్వాడీ భవనం, బూడిదపాడులో కామన్హాలు, ఈర్లదిన్నె పాఠశాలలో అదనపు తరగతి గదులను, తిప్పాయిపల్లెలో వాల్మీక భవనాలను ప్రారంభించారు. అలాగే సూగూరులో తెలంగాణ క్రీడా ప్రాంగణానికి, ఎస్సీ కమ్యూనిటీహాలుకు, ఈర్లదిన్నెలో గ్రామ పంచాయతీ భవనానికి, అయ్యవారిపల్లెలో ఎస్సీ కమ్యూనిటీ, తిప్పాయిపల్లెలో ఎస్సీ కమ్యూనిటీ హాళ్లకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎంపీపీ ఆవుల శైలజ, జెడ్పీటీసీ పెద్దింటి పద్మ, సింగిల్ విండో అధ్యక్షుడు కోదండరాంరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వనంరాములు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చారెడ్డి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.