‘అభివృద్ధి ప్రదాత, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాలమూరులో పర్యటించనున్నారు.. మే 6న దివిటిపల్లి సమీపంలోని ఐటీ టవర్‌ను ప్రారంభిస్తారు.. పర్యటనను విజయవంతం చేయాలి’.. అని అధికారులను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో టీఎస్ఐఐసీ అధికారులతో మంత్రి పర్యటనపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైవే-44 నుంచి ఐటీ టవర్ వరకు 100 ఫీట్ల కనెక్టింగ్ రోడ్డు నిర్మించాలని సూచించారు. అలాగే టవర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు రోడ్డు కనెక్టివిటీ ఉండాలని ఆదేశించారు. రోడ్డు ప్రారంభం అయ్యే చోట పెద్ద ముఖద్వారం ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు జి ల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ టవ ర్ నిర్మాణం పూర్తి కావడంతో మే 6న మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించా రు. హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో టీఎస్ఐఐసీ అధికారులతో ప్రా రంభోత్సవం, కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపై బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష ని ర్వహించారు. ప్రారంభోత్సవానికి ఏర్పా ట్లు పకడ్బందీగా చేయాలని.. హైవే నుంచి ఐటీ టవర్ వరకు వంద ఫీట్ల రహదారిని నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కనెక్టింగ్ రోడ్డు ప్రా రంభమయ్యే చోట ముఖద్వారాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని.. పాలమూరు వైభవం ఉట్టిపడేలా ఉండాలని అధికారులకు సూచించారు. ఐటీ టవర్ నుంచి జిల్లాకేంద్రానికి కూడా అదేస్థాయిలో కనెక్టింగ్ రహదారులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
40వేల ఉద్యోగాలు లక్ష్యం..
ఐటీ టవర్‌లో స్థానికులకు ఏటా పదివేల చొప్పున వచ్చే నాలుగేండ్లలో 40వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నో కం పెనీలు క్యూ కడుతున్నాయని.. ఏడాది లో పాలమూరు స్వరూపమే మారిపోతుందన్నారు. నిరుద్యోగులకు ఉన్నత శిక్షణ ఇక్కడే ఇచ్చి.. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. సమీక్షలో టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ డి. రవి, డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్యాం సుందర్‌రెడ్డి, ప్రముఖ కన్సల్టెంట్ రాజ్‌కుమార్, నిర్మాణ సంస్థ గుత్తేదారు రాజశేఖర్‌రెడ్డి, అమర్‌రాజా కంపెనీ ప్రతినిధి రవితేజ తదితరులు పాల్గొన్నారు.