అమ్మా.. చల్లంగా చూడు
అమ్మా.. జోగుళాంబదేవీ రాష్ట్ర ప్రజలను ఎప్పుడూ చల్లంగా చూడాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు వేడుకున్నారు. ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను సోమవారం ఆయన దర్శించుకొన్నారు.
- ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు
- జోగుళాంబను దర్శించుకొన్న మంత్రి, ఎమ్మెల్యేలు
అలంపూర్, ఫిబ్రవరి 19 : అమ్మా.. జోగుళాంబదేవీ రాష్ట్ర ప్రజలను ఎప్పుడూ చల్లంగా చూడాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు వేడుకున్నారు. ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను సోమవారం ఆయన దర్శించుకొన్నారు. అంతకుముందు ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్ చిన్ని కృష్ణయ్యనాయుడు, ఈవో పురేందర్‌కుమార్ ఆధ్వర్యంలో మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి బాలబ్రహ్మేశ్వరస్వామికి అభిషేకం, జోగుళాంబ దేవీకి ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు శేషవస్ర్తాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం పలికారు.
అనంతరం ఆలయాల సమీపంలోని షా-అలీ పహీల్వాన్ దర్గాను కూడా దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి వెంట ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, కలెక్టర్ సంతోష్, ఎస్పీ రితిరాజ్తోపాటు ఆలయ అధికారులు, అర్చకులు, పలువురు నాయకులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

