కొల్లాపూర్, సెప్టెంబర్ 18 : కొల్లాపూర్ దవాఖాన అభివృద్ధికి తన నిధుల నుంచి రూ. 25 లక్షలు కేటాయిస్తున్నట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. బుధవారం పట్టణంలోని ఏరియా దవాఖానను మంత్రి తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా దవాఖానలో సూపరింటెండెంట్, వైద్యులు విధులకు రాకపోవడంతో వారిపై ఆ గ్రహం వ్యక్తం చేశారు.
షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి నుంచి వివరణ తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి స్వరాజ్యలక్ష్మిని ఆదేశించారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. దవాఖానలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆ యన వెంట ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పా ర్టీ నాయకులు ఉన్నారు.