వనపర్తి, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : సమాజ పరివర్తనలో విద్య అగ్రభాగాన ఉంటుంద ని, ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేసి సమసమా జ నిర్మాణానికి కృషి చేయాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి జూపల్లి, ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్‌సురభి అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది విద్యార్థులుంటే.. వీరిలో కేవలం 22 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. రూ.లక్షల ఫీజులు, అరకొర చదువులున్న ప్రైవేట్ కంటే.. ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందన్నారు. మత్తుపదార్ధాల వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశమై వారిని చైతన్యం చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా పనిచేసి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తీసుకొచ్చారని కొనియాడారు.
ఆయనను ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని, విద్యార్థులను ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. కలెక్టర్ ఆదర్శ్‌సురభి మాట్లాడుతూ జిల్లాలో 500 పాఠశాలలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కింద రూ.13.50 కోట్లతో మౌలిక వసతులు కల్పించామన్నారు. అనంతరం జిల్లాలోని 52 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి అవార్డులను అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఈవో గోవిందరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ మహేశ్, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు వరప్రసాద్‌రావు, రవిప్రసాద్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, నాగరాజు, శ్రీనివాసరావు, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.