అమ్రాబాద్, ఏప్రిల్ 8 : న్యాయమైన హక్కుల సాధన, ప్రయోజనాల కోసం శాంతియతంగా సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఎస్ఎల్బీహెచ్ఈఎస్ ఆర్టిజన్స్ సంఘం సభ్యులు తెలిపారు. మండలంలోని ఈగలపెంట శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజలవిద్యుత్ కేంద్రం టీజీ జెన్కో ఆవరణలో ఎస్ఎల్బీహెచ్ఈఎస్ ఆర్టిజన్స్ సంఘం కార్మికులు బుధవారం సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ తమ న్యాయమైన హక్కుల సాధన, ఉద్యోగభద్రత, సముచితవేతనాలు, సంక్షే మ ప్రయోజనాల అమలు కోసం సంఘం సభ్యులు, కార్మికులం ఐక్యంగా ఉంటూ శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్టిజన్స్ సమస్యలను యాజమాన్యం, సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ సమ్మె కొనసాగుతుందని, సంస్థ అభివృద్ధికి కృషిచేస్తున్న తమకు తగిన గౌరవం, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో టీజీజెన్కో ఆర్టిజన్స్ సంఘం సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టిజన్ల నిరవధిక సమ్మె
మహబూబ్నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 8 : విద్యుత్, ఆర్టిజన్, అన్మ్యాన్డ్, పీస్రేటు కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు బుధవారం మహబూబ్నగర్ విద్యు త్ భవన్ ఎదుట నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సం దర్భంగా ఆర్టిజన్లు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఎస్ రేట్ కార్మికులకు జీవో నెం. 11 ప్రకారం వే తనాలు కల్పించాలన్నారు. ఈ సమ్మెకు 1104, 327, ఎస్టీ యూనియన్ నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టిజన్ల న్యాయమైన డి మాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో నాయకులు ఎంఏ.జకీ, పెంటయ్య, రాములు, మ్యాకల గౌరయ్య, కట్ట శ్రీనివాస్, నసీరొద్దీన్ పాల్గొన్నారు.