వనపర్తి, జూలై 11 (నమస్తే తెలంగాణ) : రైతుభరోసా అమలు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం వనపర్తి కలెక్టరేట్లో సమావేశం నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగనున్నది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, రాజనర్సింహ, కృష్ణారావు, నాగేశ్వర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షు డు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఉద యం 9:30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో మంత్రుల బృం దం ఇక్కడికి చేరుకోనున్నది. ఉమ్మడి జిల్లా నుంచి 250 మంది రైతులు ఈ సమావేశంలో పాల్గొననుండగా.. గురువారం ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఎమ్మెల్యే మేఘారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.