నాగర్‌కర్నూల్, జూలై 17 : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గులాబీ జెండా ఎగరాలని, ప్రతి కార్యకర్త కేసీఆర్, కేటీఆర్ సైనికులుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నాగర్‌కర్నూల్‌లోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మర్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ కోసం ప్రత్యేక ఉద్యమం చేసి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడన్నారు. పదేండ్లు ఎమ్మెల్యేగా ఉండి అందరికీ నచ్చిన పనులు, అభివృద్ధి చేశానని.. కొంతలో ఓడిపోయినా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. నాయకులు, కార్యకర్తలను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానన్నారు. ఒక్క ఫోన్‌కాల్‌తో ఇంత మంది వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
పార్టీలో ఉండి అడ్డదారులు తొక్కే అవకాశవాదులను గుర్తు పెట్టుకుంటానని, ఎవరి లెక్కలు వాళ్లకు అప్పజెప్పేందుకు మీరందరూ సహకరించాలని కోరారు. సంవత్సర కాలంగా కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి గ్రామాలకు ఒక్కపైసా రాలేదన్నారు. ప్రజాపాలన అం టూ గ్రామాల్లో ఉన్న ఏ ఒక్క సమస్యను పట్టించుకోలేదని, అలాంటి వారికి స్థానిక సంస్థల్లో అవకాశం ఇస్తే అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే బీజేపీ నాయకులు ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందేనని, ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పెట్టే కేసులకు భయపడేది లేదని, వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమేనన్నది గుర్తుంచుకోవాలన్నారు. గ్రామాల్లో పోలీసులు లేనిది ఎమ్మెల్యేలు, మం త్రులు సభలు, స మావేశాలకు రా వడం లేదన్నా రు.
ఎప్పుడూ కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని కొందరు అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వంలోకి వచ్చాక అతిగా వ్యవహరించే వారిని గుర్తుంచుకుంటామన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులకు కాంగ్రెసోళ్లు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పాతరేయాలని ప్రజలను కోరారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగం శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఒకే నిర్ణయంతో ముందుకు సాగుతూ బీఆర్ఎస్ నేతల గెలుపుకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ హన్మంతురావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జోగు ప్రదీప్, పులెందర్‌రెడ్డి, రమణ, మాజీ జె డ్పీటీసీ శ్రీశైలం, వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీ నివాస్‌గౌడ్, వెంకట్రాములు, మనోహర్‌యాదవ్, బాబురావు, మాధవరెడ్డితదితరులు ఉన్నారు.
గుడిపల్లికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ యామనమోని పద్మమ్మ 50 మం ది కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మర్రి జనార్దన్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.