వైద్యాధికారుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం.. వైద్యుల్లో కొరవడిన చిత్తశుద్ధి.. వెరసి సర్కారు వైద్యం పడకేసింది. పాలమూరులో జనరల్ దవాఖానలో అత్యవసర సేవలు అటకెక్కాయి. కనీసం రోగి చేయి పట్టి చూసే డాక్టరే కరువయ్యాడు. కేవలం వీఐపీలు, వైద్యశాల సిబ్బంది బంధువులకే ప్రియారిటీ ఇస్తున్నారు. అత్యవసర సేవలు కూడా సక్రమంగా అందడం లేదని, చాలా మంది డాక్టర్లు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలు అనారోగ్య సమస్యలతో విలవిలలాడుతున్నారు. సమయానికి ట్రీట్మెంట్ అందక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ రోగులు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. సర్కారు దవాఖానలంటేనే జంకుతున్నారు.
– మహబూబ్‌నగర్, జూన్ 9
మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో వైద్య సేవలు దైవాదీనంగా మారాయి. పేరుకే పెద్ద దవాఖాన అని.. ఇక్కడ అన్ని వైద్య పరికరా లు ఉన్నా.. సీనియర్ వైద్యులు ఉన్నా.. అత్యవసర సేవ లు అందడం లేదని, దీంతో పలువురు రోగులు మృ త్యువాత పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మ హబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలోని పెద్ద దవాఖానలో అధునాతన సేవలు ఉన్నాయని ఓ వైపు వైద్య శాఖాధికారులు చెబుతున్నా ఆవి మాటలకే పరిమితమయ్యాని రోగులు ఆందోళన చెందుతున్నారు. ‘నే ను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు..’ అన్న చందంగా ఆంధ్రా పాలనలో పడుకున్నా పాట లు నేడు రేవంత్ ప్రభుత్వ హయాంలో మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. దీంతో పలువురు రోగులు ప్రైవేటు దవాఖానలకు వెళ్తున్న ఘటనలు ఉన్నాయి.
పాలమూరు జిల్లా దవాఖానకు అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులు వైద్యం కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇం టెన్సివ్, అసిస్టెంట్ డాక్టర్లతోనే తెలిసీ తెలియని వైద్యం అందిస్తున్నారని వి మర్శలు ఉన్నాయి. అదే తెలిసినా వారు.. దవాఖానలో పనిచేసే వై ద్యులు, సిబ్బంది బంధువులు, సన్నిహితులు ఎవరైనా వస్తే మా త్రం క్షణాల్లో మెరుగైన వైద్యం అందుతుందని పుకార్లు లేకపోలేదు. దవాఖాన సూపరిటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీరా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచిస్తున్నారు. కానీ వైద్యులు అందుబాటులో లేకుండా ఫోన్లో రిపోర్టులు చూసి సేవలు అందిస్తున్నారని రోగులు ఆవేదన చెందుతున్నారు. కనీసం నాడి పట్టే నాథుడు కరువయ్యాడని ఆగ్రహం చెందుతున్నారు.
మహబూబ్‌నగర్ పెద్ద దవాఖానలో పనిచేస్తున్న వైద్యులు బయట ప్రైవేట్ దవాఖానలో సేవలు అందిస్తున్నారన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. జనరల్ దవాఖాన కావడం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పెద్ద దవాఖాన కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రోగులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన రోగులకు కేవలం జూనియర్ డాక్టర్లు పరీక్షించడం.. సిబ్బంది మాత్రమే సేవ లు అందిస్తున్నారు. సీనియర్ డాక్టర్లు అందుబాటులో ఉం డడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లోని చోటమోట డాక్టర్లు రోగులను ఈ వైద్యశాలకు రెఫర్ చేస్తే.. ఇక్కడికొచ్చాక వారికి అసలు విషయం అర్థమవుతోంది. వైద్య సేవలు సరైన సమయంలో అందక కొన్ని సార్లు అక్కడ డ్యూటీల్లో ఉన్న వైద్యులను ప్రాధేయపడాల్సిన దుస్థితి నెలకొన్నదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద దవాఖానలో పనిచేస్తున్న చాలా మంది వైద్యులు రాష్ట్ర రాజధాని నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ నిత్యం కారు లో వచ్చి కొద్దిసేపు ఉండి.. మళ్లీ అదే కారు లో డ్యూటీ సమయానికి కన్నా ముందే వెళ్తూ.. చుట్టం చూపుగా వచ్చి పోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని ప్రధాన విభాగాలకు చెందిన హెచ్వోడీలు నిత్యం ఇలా టైం ప్రకారం వైద్య సేవలు అందిస్తున్నారు.. స్థానికంగా ఉండేందుకు క్వార్టర్స్ ఉన్నా.. ఉండకుండా రాకపోకలు సాగిస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడకు చెందిన పుట్టపాట నర్సింహ అనే వ్యక్తి కాలు విరిగిపోవడంతో ఓ ప్రైవేట్ దవా ఖానలో మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తర్వాత కాలు వాయడంతో గతనెల 19వ తేదీన ఉదయం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో చేరాడు. పరీక్షించిన వైద్యులు ఆర్థోపెడిక్ సమస్య ఉన్నదని తెలుపగా.. పైరవీ చేసి మొత్తానికి వైద్యశాలలోని ఆర్థో వార్డులో అడ్మిట్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు రక్త పరీక్షలు చేశారు. మధ్యాహ్న సమయంలో కాళ్ల నొప్పులు ఉన్నాయని డ్యూటీ డాక్టర్లకు చెప్పినా కేవలం మాత్రలు రాసి ఇచ్చారు. రేపు రిపోర్టులు
వస్తాయని, అప్పటి వరకు తాము ఏమి చేయ లేమని చెప్పడంతో వార్డులోనే రోగి ఇబ్బందులు పడ్డాడు. ఈ క్రమంలో 20న ఉదయం రోగి పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లాడు. అప్పుడు ఐసీయూకు తరలించి వైద్యసేవలు అందించి నప్పటికీ అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. అయినా లాభం లేక మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మృతి చెందాడు. సరైన సమయంలో పేషంట్‌కు మెరు గైన.. సత్వర వైద్యం అందించి ఉంటే సదరు రోగి మృతి చెందేవాడు కాదని బంధువులు ఆరోపిస్తున్నారు.
కింది ఫొటోలో ఉన్న వ్యక్తి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బండ్లగేరికి చెందిన యాదగిరి.. గత ఫిబ్రవరి 19వ తేదీన ఉదయం అనారోగ్యంతో పాలమూరు ప్రభుత్వ జనరల్ దవాఖానకు వెళ్లాడు. ఆ సమయంలో సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లతో వైద్య సేవలు అందించారు. బీపీ పెరగడం.. శ్వాస సమస్య తీవ్రంగా ఉండడంతో వెంటనే ఆక్సిజన్ అందించి ఉంటే ప్రాణాలు దక్కేవి. కానీ ఒక్క డ్యూటీ డాక్టర్ కూడా రాకపోవడంతో.. తీవ్ర అస్వస్థతకు గురైనా పట్టించు కోలేదని అతడి బంధువులు ఆరోపించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా సరైన సమయంలో వైద్య సేవలు అందకపోవడంతో నిండుప్రాణం కోల్పోయాడు.
రోగులకు ఆత్యవసర సేవలు అందిస్తున్నాం. పేషెంట్లకు వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. చాలా మంది డాక్టర్లు మంగళవారం బదిలీ అయ్యారు. మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం.
– రంగా ఆజ్మీరా, సూపరింటెండెంట్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖాన