అలర్ట్‌గా ఉండండి..
శాసన ఎన్నికల నిమిత్తం వచ్చిన ప్రతిపిర్యాదులను తక్షణమే స్పందించడంతోపాటు పరిష్కారించాలని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండ చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్.రవి నాయక్ అన్నారు. బుధవారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది,
- పాలమూరు కలెక్టర్ రవినాయక్
మహబూబ్‌నగర్, నవంబర్ 29 : శాసన ఎన్నికల నిమిత్తం వచ్చిన ప్రతిపిర్యాదులను తక్షణమే స్పందించడంతోపాటు పరిష్కారించాలని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండ చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్.రవి నాయక్ అన్నారు. బుధవారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది, 1950 కాల్ సెంటర్, జిల్లా స్థాయి కంట్రోల్ రూం, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్, సోషల్ మీడియా కంట్రోల్ రూంల సిబ్బంది అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈనెల 30వ తేదీన నిర్వహించనున్న ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పరిష్కారించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండు అవుట్ గోయింగ్ కాల్స్‌తోపాటు రెండు ఇన్కమింగ్ కాల్స్ సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం, సీవిజిల్, 1950, సోషల్ మిడియా, మీడియా మానిటరింగ్ అన్ని కంట్రోల్ రూంలు పూర్తి అప్రమత్తంగా ఉండి చురుకుగా పనిచేయాలని ఆదేశించారు. 24 గంటల విధులకు నియమించబడిన ఉద్యోగులు రిలీవర్ వచ్చిన తరువాతే విదుల నుంచి రిలీవ్ కవాలని, అప్పటి వరకు విధులు నిర్వహించాలన్నారు.
పోలింగ్ స్టేషన్ లోపలబయట జరిగే సంఘటనలకు సంబంధించి కచ్చితంగా సమాచారాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారులు, పీవో, సెక్టర్ ఆఫీసర్ల ద్వారా పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తరువాతే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కంట్రోల్ రూంలు, ముఖ్యంగా సోషల్ మీడియా మానిటరింగ్‌పై ఉంటుందన్నారు. కంట్రోల్ రూంలో పోలింగ్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, ఎంపీడీవో, తాసీలాద్దర్ అందరి ఫోన్ నెంబర్లతో సహ డేటాను నిర్వహించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులు పది నిమిషాల్లో పంపించాల్సి ఉంటుందని ఆదేశించారు. ఎన్ కోర్ ద్వారా ఎప్పటికప్పుడు ఆన్లైన్ ఆప్డేట్ చేయాలని, రిపోర్టులు అన్నింటిని జాప్యం లేకుండ అందులో సమర్పించాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యంగా పోలింగ్ శాతానికి సంబంధించి ఓటర్ టర్న్ అవుట్, కంట్రోల్ రూం అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా అంకెలను తెలియజేయాలని చెప్పారు. ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన సంబంధించి సమాచారం అందినప్పుడు తక్షణమే వివిధ నోడల్ అధికారులు బృందాలతో సమన్వయం చేసుకుని తక్షణ చర్యలు చేపట్టేలా పనిచేయాలన్నారు. అన్ని బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉండి పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు పెట్టకుండ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.

ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు
నారాయణపేట, నవంబర్ 29 : ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఎస్పీ యోగేశ్ గౌతమ్‌తో కలిసి పరిశీలించారు. జిల్లాలో మొత్తం 4,42,284 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. మొత్తం 554 పోలింగ్ కేంద్రాలకుగానూ 2,588 మంది పీవోలు, ఏపీవోలు విధులు నిర్వర్తించడం జరుగుతుందన్నారు. మక్తల్‌లో 35, నారాయణపేటలో 28 రూట్లకు గానూ 92 మంది మైక్రో అబ్సర్వర్లను, 63 మంది స్పెట్రోల్ అధికారులను నియమించారు. పోలింగ్‌కు ముందు ఏజెంట్ల సమక్షం లో మాక్ పోలింగ్ నిర్వహించాలన్నారు. సాయుధ పోలీస్ బం దోబస్తు మధ్య ఎలక్ట్రానిక్ పోలింగ్ యంత్రాలను తరలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరుగుకుం డా జాగ్రత్తగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం వరకు ఎవరూ గుంపులుగా ఉండకుండా చూ డాలన్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కేంద్రాలు ఏర్పాటు చేశామ ని, వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించడం జరుగుతుందన్నారు. 12 రకాల ఐడీ కార్డుల్లో ఏదో ఒకదాని ద్వారా ఓటు వేసేందుకు ఓటర్లకు అనుమతించాలన్నారు. సాంకేతిక సమస్యలు తెలెత్తితే వెంటనే అధికారులకు తెలపాలన్నారు. కార్యక్రమం లో మక్తల్ ఆర్వో మయాంక్ మిట్టల్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, పేట ఆర్వో రాంచందర్, డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

