హన్వాడ, నవంబర్ 27 : ఆయిల్ ట్యాంకర్, స్టీల్ కంటైనర్ ఢీ కొన్న ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనమైన ఘటన హన్వా డ మండలం పల్లెమోనికాలనీ, పిల్లిగుండు గ్రామాల మధ్య బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే హన్వాడ మండలం పల్లెమోనికాలనీ, పిల్లిగుండు గ్రామాల సమీపంలో మహబూబ్నగర్, చించోలి ప్రధాన రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో బెంగళూరు వెళ్తున్న ఆయిల్ ట్యాం కర్ వాహనం, పూణే వెళ్తున్న స్టీల్ కంటైనర్ వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి.
దీంతో ఆయిల ట్యాంకర్ లీకేజీ కావడంతో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. వీటిలో ట్యాం కర్ డ్రైవర్ కర్ణాటకకు చెందిన నిరంజన్ మంటల్లోనే పూర్తిగా కాలిపోయాడు. స్టీల్ కంటైనర్ డ్రైవర్ మాత్రం ప్రమాదం నుంచి బయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి మంటలను అదుపు చేయించారు.