ఉప్పునుంతల, ఆగస్టు 22 : నిఖార్సైన కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన ఉప్పునుంతలలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త రవీందర్రావు అధ్యక్షతన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ మండలంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని, మీ ఉత్సాహం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా వారికి తాను అండగా ఉంటానని, ఎవరు కూడా అధ్తెర్యపడకూడదని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకుండా పాలన గాలికి వదిలేసి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి విహార యాత్రలూ చేస్తూ గాలి మోటర్లలో నోట్ల మూటలు మోస్తున్నారన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చిన వాటిని అమలు చేయలేక కాలయాపన చేస్తూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ చేస్తున్న మోసాలు, వైఫల్యాలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోకల మనోహర్, మాజీ మున్సిపల్ చైర్మన్లు తులసీరాం, నర్సింహాగౌడ్, సింగిల్‌విండో చైర్మన్ భూపాల్‌రావు, నాయకులు గోపాల్‌రెడ్డి, భాస్కర్, బాలునాయక్, శోభన్‌రెడ్డి, వెంకటయ్య, మల్లయ్య, కృష్ణ య్య, సవేందర్సింగ్, సంతోష్‌రెడ్డి, లింగమయ్య, ఖాజా, సుల్తాన్, సతీశ్‌రెడ్డి, కృష్ణ, అశోక్‌రెడ్డి, భగవంత్, ఎల్లయ్యయాదవ్, చిన్నజంగయ్య, బాలస్వామి, సోషల్ మీడి యా ఇన్‌చార్జ్జి బాలరాజుతోపాటు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
అచ్చంపేటరూరల్, ఆగస్టు 22 : తెలంగాణలో కాంగ్రెస్ ఇరవై నెలలుగా దుర్మార్గ పాలన కొనసాగిస్తుందని, దీనిని ప్రజలకు వివరించి స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేందుకు కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం అచ్చంపేట మండలంలోని హజీపూర్ శివారులోని మమత గార్డెన్ ఫంక్షన్ హాల్లో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని, స్థానిక ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులను అందరూ సమన్వయంతో పనిచేసి గె లుపించుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చిందని, ఆ హామీలను పూర్తిగా అమలు చేయకుండా అన్నివర్గాల ప్ర జలను మోసం చేసుందన్నారు. దీంతో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్నారని మళ్లీ బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని, అందుకే కార్యకర్తలు ప్రజలకు నిత్యం వారికి అందుబాటులో ఉండి వారిని బీఆర్ఎస్ వైపు మళ్లించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోకల మనోహర్, పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ మేడమోని పర్వతాలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు కేతావత్ తులసీరాం, ఎడ్ల నర్సింహాగౌడ్, నాయకులు సే వ్యానాయక్, దాసరి మల్లయ్య, బోడ నారాయణ, బోడ్క నాయక్, వెంకటయ్య, రవీందర్, రమేశ్‌రావు, చుక్కారెడ్డి, అమినొద్దీన్, సోషల్ మీడియా ఇన్చార్జి పిల్లి బాలరాజుతోపాటు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.