Convergence India Expo | న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో నిర్వహిస్తున్న కన్వర్జేన్స్ ఇండియా ఎక్స్పో కార్యక్రమంలో మరికల్ మండల కేంద్రానికి చెందిన అడ్వకేట్ అయ్యప్పతోపాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రోన్ల వినియోగంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు వారు తెలిపారు. రైతులకు రోడ్ల ఆవశ్యకత పై అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నారాయణపేట జిల్లాలో రోడ్ల వినియోగం తదితర వాటిని చర్చించనున్నట్లు తెలిపారు. టెలీ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ తదితర వాటి గురించి ప్రముఖులు ఈ సమావేశంలో వివరించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా నారాయణపేట జిల్లా రైతులకు డ్రోన్ల వినియోగం గురించి తెలియజేసేందుకే పూర్తిస్థాయిలో అవగాహన పొందేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడ్వకేట్ అయ్యప్ప, మరికల్ మండల బిజెపి అధ్యక్షులు మంగలి వేణుగోపాల్, మండల బిజెపి ఉపాధ్యక్షులు పోలేమాని రమేష్, బిజెపి నాయకులు, మరికల్ మాజీ ఉపసర్పంచ్ సీమ శివకుమార్, మిమిక్రీ అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.