Ambali Centre | మరికల్ మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఇవాళ మరికల్ ఎస్సై రాము ప్రారంభించారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్సై రాము మాట్లాడుతూ.. అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో గత 22 సంవత్సరాల నుండి అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అయ్యప్ప భక్తులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం అయ్యప్ప భక్తులు ఎస్సై రామును ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురు స్వాములు కస్పే లక్ష్మయ్య, శ్రీనివాసులు, కస్పే సతీష్ కుమార్, బోండాల మల్లేష్ , వీర బసంతు, అఖిలపక్ష నాయకులు కర్లీ కృష్ణయ్య, లంబాడి రాములు, నాగరాజు, కోసూరు ఆశప్ప, ఆనందులతోపాటు అయ్యప్ప భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి