మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 2 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ హడలెస్తున్నది. ఈ బ్యాచ్ పట్టణంలో రాత్రి అయితే చాలు ఎవరిపైనంటే వారిపై దాడులు చేస్తూ అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో గంజాయి బ్యాచ్ పాలమూరు పట్టణంలోని ఓ యువకుడిపై దాడి చేసిన ఘటన మరవకముందే మరో ఘటనలో రెండురోజుల కిందటే మహబూబ్‌నగర్ టు టౌన్ పోలీసులకు చిక్కారు. రెండు రోజుల కిందట న్యూటౌన్‌లోని గం జాయి బ్యాచ్ ఒకరిపై ఒకరు పదునైన ఆయుధాలతో దా డులకు పాల్పడుతుండగా స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహబూబ్‌నగర్ డీఎస్పీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. రెండు రోజుల కిందట గంజాయి బ్యాచ్ గతంలోనూ పలు అరాచకాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉ న్నాయి. గంజాయి బ్యాచ్ ఆగడాలపై ఎస్పీ జానకి సీరియస్‌గా ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. వారం కిందట ఖిల్లా ఘణపూర్‌లో ఎస్పీ రూ.83లక్షల 12వేల గంజాయిని దహనం చేశారు. మరోసారి వినియోగించకుండా చర్యలు తీసుకుంటున్నా కొద్దిమంది యువకులు మళ్లీ గంజాయికి బానిసలవుతున్నారు.
రాత్రివేళలో యువత విచ్చలవిడిగా తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ దారినపోయే వారిపై దాడి చేస్తున్న ఘటనలు, దొంగతనాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలో కొందరు యువకులు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి తాగుతుండగా రెడ్‌హ్యండెడ్‌గా పోలీసులు పట్టుకొని విచారణ మొదలు పెట్టారు. అయితే వారు గంజాయి మత్తులోనే గొడవలు, దొంగతనాలకు పాల్పడుతున్నారని, గంజాయికి బానిసగా మారిన యువత దానికోసం ఆత్మహత్యకు సైతం దిగుతుండడం పోలీసులకు విస్మయానికి గురిచేసింది.
ఏకంగా పోలీసుల విచారణలో గంజాయికి అలవాటుపడిన ఓ యువకుడు నేరుగా ఒప్పుకోవడం, మత్తుకోసం సూసైడ్ చేసుకునేందుకు సిద్ధమవడం కూడా మనం చూస్తున్నాం. దీంతో పోలీసులు గంజాయి రవాణాపై దృష్టి పెట్టారు. యువత చెడుదారుల్లో పయనించడం, గొడవలకు దిగడం, రాత్రి వేళలో విచ్చలవిడిగా తిరుగుతుండడం పోలీసుల నిఘాలో తెలింది. దీంతో ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణలోనే జిల్లాలో విస్తరించిన గంజాయి సరఫరా ముఠా తిష్టవేసినట్లు పోలీసులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ప్రధానంగా కళాశాలల యువత గంజాయి మత్తులో జోగుతున్నారు.
పట్టణంలోని బండమీదిపల్లి, బ స్టాండ్, మార్కెట్ యార్డు, శ్రీనివాసాకాలనీ పార్కు ఏరియాతోపాటు ఇతర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక గంజాయి సరఫరా చేసే ముఠా జిల్లాను టార్గెట్ చేసింది. కొన్ని ప్రాంతాల్లో నిర్ధిష్ట సమయాలను ఎంచుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు గంజాయి అమ్మకం సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా ప్రకాశం, గుంటూరు, నల్గొం డ, కర్నూల్ ప్రాంతాల నుంచి కూడా గం జాయి విచ్చలవిడిగా వస్తున్నట్లు సమాచారం.
కొన్నిరోజుల కిందట రూరల్ పోలీసు స్టేషన్ సమీపంలోని ఓ బార్ వద్ద టీచర్స్‌కాలనీకి చెందిన వెంకట్‌రెడ్డిపై గంజాయి మత్తులో మక్బూల్, సోఫియాన్ పదునైన ఆ యుధాలతో దాడిచేసి నారాయణపేటకు పారిపోయారు. దాడి ఘటనపై బాధితుడు రూరల్ పోలీసు స్టేషన్లో ఫి ర్యాదు చేశాడు. ఈ ఘటనపై గంజాయి బ్యాచ్ యువకుడిపై దాడి అని ‘నమస్తే తెలంగాణ’లో వార్త ప్రచురించడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. అరబ్గల్లికి చెందిన మక్బూల్, సోఫియాన్, కోయిలకొండ మం డలం రాంపూర్‌కు చెందిన మతీన్ ముగ్గురు స్నేహితులు.
శుక్రవారం మక్బూల్ మహబూబ్‌నగర్‌కు రాగా సోఫియాన్, మతీన్ కలిసి ముగ్గురు రాత్రి అరబ్‌గల్లిలో మద్యం తాగారు. అర్ధరాత్రి దాటాక రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో వారిమధ్య వాగ్వాదం జరిగింది. దాడి కేసులో ఉన్న మక్బూల్ ఒక్కడే పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని మతీన్ సూచించాడు. దీంతో కోపంతో మ క్బూల్ కత్తితో మతీన్‌పై దాడి చేయగా అతడికి వీపు భాగం లో స్వల్ప గాయమైంది. గమనించిన పోలీసులు గొడవపడుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.