కోయిలకొండ, జనవరి 8 : క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందని జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. యువజనోత్సవాల్లో భాగంగా కోయిలకొండ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండలస్థాయి వాలీబాల్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకుగానూ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు.
చదువుతోపాటు క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్తు ఉం టుందన్నారు. యువత క్రీడల్లో రాణించి మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం రామన్నపల్లితండాలో సర్పం చ్ చక్రవర్తి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, ఎస్సై శ్రీనయ్య, ఎంపీటీసీ ఆంజనేయులు, కోఆప్షన్ సభ్యుడు టీవీ ఖాజా, నాయకులు మోదీపూర్ రవి, శ్రీనివాస్‌రెడ్డి, భీంరెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
మార్షల్ ఆర్ట్స్‌లో రాణించాలి
మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 8 : బాలబాలికలు మార్షల్ ఆర్ట్స్‌లో రాణించాలని తైక్వాండో అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి సురేందర్‌బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఆదివారం విద్యార్థులకు బెల్టుగ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బెల్టులను ప్రదానం చేశారు. అనంతరం సురేందర్‌బాబు మాట్లాడుతూ కరాటేతో ఆత్మరక్షణ లభిస్తుందని, ప్రస్తుత సమాజంలో కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తైక్వాండో గుర్తింపు ఉన్న క్రీడ అని, బాలబాలికలు మెరుగైన శిక్షణ పొంది రాణించాలని సూచించారు. తైక్వాండో క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మేడ్చల్‌లో 28, 29 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాస్టర్లు శంకర్, రఫి, దీపు, సాయికీర్తన, లయ, వీణ, వెంకటకృష్ణమానాయుడు, రాజేశ్, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ప్రతిభ
మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 8 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బెల్టుగ్రేడింగ్ పరీక్షల్లో జిల్లా కేంద్రానికి చెందిన డ్రాగన్ షోటోకాన్ కరాటే-డూ విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ విభాగాల్లో 40మంది విద్యార్థులు బెల్టులు సాధించినట్లు పట్టణ అధ్యక్షుడు మోసీన్ తెలిపారు. విద్యార్థులను డ్రాగన్ షోటోకాన్ కరాటే-డూ ఫౌండర్ సాలంబిన్ ఉమర్ అభినందించారు.