భూత్పూర్, మే 6 : పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొత్తమొల్గర ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మనఊరు-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మనఊరు-మనబడి కార్యక్రమం చేపట్టారని తెలిపారు. మండలంలో మనఊరు-మనబడికి ఎంపికైన 19 పాఠశాలల్లో అభివృద్ధి ప నులను ప్రారంభించాలని సూచించారు. పా ఠశాలల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మ న్ అశోక్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, మండల ప్రత్యేకాధికారి సాయిబాబా, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, ఎంఈవో నాగయ్య, సర్పంచ్ వెంకటమ్మ, క్లస్టర్ హెచ్ఎం కవిత పాల్గొన్నారు.
ఔట్‌పోస్ట్ నిర్మాణానికి భూమిపూజ
దేవరకద్ర రూరల్, మే 6 : చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి ఆలయం వద్ద పోలీస్ ఔట్‌పోస్ట్ నిర్మాణానికి ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కురుమూర్తిస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపా రు. దేవాదాయ శాఖ వారు దాతల సహకారంతో పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రజిత, ఎస్సైలు భాగ్యలక్ష్మీరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, ఆలయ పాలకమండలి చైర్మన్ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
దేవరకద్ర మండలంలోని గోపన్‌పల్లిలో నిర్వహించిన దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాల్లో ఎమ్మెల్యే ఆల పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య బొడ్రాయి, పోతురాజు, పోచమ్మ, కర్రమ్మ, ఊరడమ్మ విగ్రహాల ప్ర తిష్ఠాపన ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కోట్ల రజితాభాస్కర్రెడ్డి, ఎంపీటీసీ ఆంజనేయులు, రై తుబంధు సమితి మండల అధ్యక్షుడు కొం డారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, కొండా శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.