Mrunal Takhur | బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె నటించిన సినిమాల కంటే వ్యక్తిగత జీవితం, రూమర్లు, ఫోటోలు వంటి విషయాలే ఎక్కువ చర్చకు దారితీస్తున్నాయి. హిందీ టెలివిజన్ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన మృణాల్, క్రమంగా బాలీవుడ్ సినిమాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేసింది. మృణాల్ కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన సినిమా ‘సీతారామం’. దర్శకుడు హను రాఘవపూడి ఆమెకు ఇచ్చిన అవకాశం ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాలో ఆమె అందం, నటన, భావోద్వేగ సన్నివేశాల్లో చూపిన ఎక్స్ప్రెషన్స్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ ఒక్క సినిమాతోనే ఆమె టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది.
‘సీతారామం’ తర్వాత వచ్చిన ‘హాయ్ నాన్న’ చిత్రంలో కూడా మృణాల్ తన నటనతో మెప్పించింది. కానీ మూడో ప్రయత్నంగా చేసిన ‘ది ఫ్యామిలీ స్టార్’ మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ సినిమా ఫలితం ఆమె కెరీర్‌పై కొంత ప్రభావం చూపిందనే చెప్పాలి. మూడు సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత పెద్ద అవకాశాలు మాత్రం వెంటనే దక్కలేదనే టాక్ వినిపించింది. ‘కల్కి 2898 AD’ సినిమాలో చిన్న క్యామియో చేసినప్పటికీ అది ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదని సినీ వర్గాల అభిప్రాయం. అయితే తాజాగా అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘డెకాయిట్’ చిత్రంలో హీరోయిన్గా అవకాశం దక్కించుకోవడం ఆమెకు మరో మంచి ఛాన్స్‌గా భావిస్తున్నారు. ఈ సినిమాలో అద్భుతమైన జోడీగా కనిపిస్తారన్న అంచనాలు ఉన్నాయి.
మృణాల్ గురించి సినిమాల కంటే ఎక్కువగా వినిపించేది రూమర్లే. ఆమె ఎవరితో ఫోటో దిగినా, ఎవరితో కాస్త సన్నిహితంగా కనిపించినా వెంటనే సోషల్ మీడియాలో గాసిప్స్ మొదలవుతున్నాయి. ఒకసారి హీరో సుమంత్‌తో కలిసి దిగిన ఫోటో వైరల్ కాగా, అది ‘సీతారామం’ కాలంలో తీసినదేనని తర్వాత తెలిసింది.ఇటీవలి కాలంలో కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో ఆమెకు లింక్ పెడుతూ వార్తలు వచ్చాయి. మృణాల్ స్వయంగా “కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే” అని క్లారిటీ ఇచ్చినా రూమర్లు మాత్రం ఆగలేదు.అలాగే బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ చతుర్వేదితో క్లోజ్‌గా కనిపించడంతో మళ్లీ కొత్త చర్చలు మొదలయ్యాయి. ఈ రూమర్లు ఒకవైపు మృణాల్‌ను నిరంతరం వార్తల్లో ఉంచుతున్నాయి. మరోవైపు ఇవి ఆమెకు వ్యక్తిగతంగా ఇబ్బందులు కలిగించే అవకాశమూ ఉంది. సినిమాల కంటే గాసిప్స్ ఎక్కువగా హైలైట్ కావడం ఆమె ఇమేజ్‌పై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.