Crime News | మిడ్జిల్, ఫిబ్రవరి 16 : గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై శివ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామవాసి చొప్పరి రాఘవేందర్ ( 25) మిడ్జిల్ నుండి పనులు ముగించుకొని వెంకటాపూర్ వెళ్తుండగా వెల్జల్ రోడ్డు, వెంకోబా చికెన్ కంపెనీ సమీపంలో వెనకవైపు నుండి గుర్తు తెలియ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు. మృతి చెందిన రాఘవేందర్‌కు గత ఆగస్టులో పెళ్లి జరిగింది. భార్య ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున వినిపించారు.