నాగర్‌కర్నూల్/నాగర్‌కర్నూల్ రూరల్, మే 21: బీజేపీ నేత మాజీ పార్లమెంట్ సభ్యుడు పోతుగంటి రాములు తనయుడు పోతుగంటి భరత్‌ప్రసాద్ కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెం దిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తెలకపల్లి మండలం గట్టురావిపాకుల గ్రామానికి చెందిన చటమోని రాము లు(40) అనే వ్యక్తి నాగర్‌కర్నూల్ నుంచి తన టీవీఎస్ వాహనంపై మంగళవారం సాయంత్రం స్వగ్రామానికి వెళుతున్నాడు.
ఇదేక్రమంలో అచ్చంపేట వైపు నుంచి నాగర్‌కర్నూల్‌కు వస్తున్న భరత్‌ప్రసాద్ కారు రాములును ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడగా తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు నాగర్‌కర్నూల్ జనరల్ దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాములు మధ్యరాత్రి మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన కు టుంబ సభ్యులు, గ్రామస్తులు బుధవా రం మధ్యాహ్నం నాగర్‌కర్నూల్ జనరల్ దవాఖానకు ఎదుట ధర్నాకు దిగారు.
కుటుంబాన్ని ఆదుకొని న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, బంధువు లు, బీఆర్ఎస్, బీఎస్పీ, సీపీఐ నాయకులతోపాటు గట్టురావిపాకుల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దాదాపు గంటపాటు నిర్వహించిన ఆందోళనతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ప్ర యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు నచ్చజెప్పినా బాధితుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన విరమించలేదు. ఇటు బస్టాండ్ వ రకు అటు ఆర్టీసీ డిపో వరకు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో సీఐ కనకయ్య వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమింప చేయించారు.