జడ్చర్లటౌన్, డిసెంబర్ 1 : గొంతులో గుడ్డు ఇరుక్కోవటంతో ఊపిరి ఆడక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో సోమవారం రాత్రి వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని చైతన్యనగర్కాలనీకి చెందిన పాండుకుమార్(43) అనే ఆటో డ్రైవర్ సోమవారం రాత్రి తన ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేస్తూ ఉడకబెట్టిన గుడ్డును తినే క్రమంలో గుడ్డు గొంతులో ఇరుక్కుంది.
దీంతో ఊపిరి ఆడక ఇబ్బందిపడుతున్న పాం డును కుటుంబసభ్యులు గుర్తించి వెంటనే జడ్చర్ల సర్కారు దవాఖానకు తరలించారు. వెంటనే దవాఖాన డ్యూటీ డాక్టర్లు అతడిని పరిశీలించి చికిత్సలు అందిస్తుండగా పాండు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాండు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.