పెద్దకొత్తపల్లి, జూలై 13 : నాగర్కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకోలు గ్రామానికి చెందిన కర్నాటి నిర్మల తన భర్త దామోదర్గౌడ్ రెండు రోజుల నుంచి కనిపించడం లేదని ఆదివారం పోలీస్సేష్టన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీస్ సి బ్బంది దామోదర్గౌడ్ ఆచూకీ కోసం గాలిస్తుండగా, సిం గోటం చెరువులో ఒంటిపై గాయాలతో అనుమానాస్పదస్థితిలో చనిపోయి కనిపించినట్లు తెలిపారు. దీంతో వారు విచారించగా దామోదర్గౌడ్గా గుర్తించారు.
మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా గ్రామస్తులు దామోదర్గౌడ్ మృతికి కారణం అక్రమ సంబంధమే ప్రాణం తీసినట్లు చర్చించుకుంటున్నారు. సదరు గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ మహిళతో ఉండగా చూసిన ఆ మహిళ కుటుంబ సభ్యులు దామోదర్గౌడ్తోపాటు మహిళపై దాడి చేయగా దామోదర్గౌడ్ అక్కడికి అక్కడే మృతిచెందినట్లు తెలిసింది. మృతిచెందిన విషయాన్ని దాడి చేసిన వారు గుర్తించి మృతదేహాన్ని మూటకట్టి ఎంజీకేఎల్ఐ ప్రధాన కాల్వలో వేయడంతో నీటి ప్రవాహానికి సింగోటం చెరువులోకి కొట్టుకొచ్చిన్నట్లు చర్చించుకుంటున్నారు. దామోదర్గౌడ్ మృతికి గల కారణాలను విచారిస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.