మక్తల్, ఫిబ్రవరి 18 : రేప్ కేస్ నిందితుడికి అనుకూలంగా చార్జిషీటు అనుకూలంగా రాస్తామంటూ రూ.20వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు అవినీతి నిరోధక శాఖకు దొరికిన ఘటన మంగళవారం మక్తల్ పోలీస్స్టేషన్లో చోటుచేసుకున్నది. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఫైనాన్స్ నిర్వహిస్తున్న సంధ్యావెంకట్రాములుపై ఇటీవల లైంగికదాడి కేసు నమోదైంది. కాగా, హైకోర్టుకు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు.
బెయిల్పై వచ్చినా మక్తల్ పోలీస్స్టేషన్లో హాజరుకావాల్సి ఉండగా, చార్జిషీటు అనుకూలంగా రాస్తామంటూ సీఐ చంద్రశేఖర్ కానిస్టేబుళ్లు నర్సింహులు, సింగసాని శివతో కలిసి సంధ్యా వెంకట్రాములు వద్ద రూ.20వేలు లంచం ఇవ్వాల్సిందిగా డిమాం డ్ చేశారు. దీంతో సంధ్యా వెంకట్రాములు ఈ విషయం ఏసీబీకి తెలుపడంతో మంగళవారం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు. సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకొచి విచారణ చేపట్టామని తెలిపారు. దాడుల్లో అవినీతి నిరోధక శాఖ సీఐ లింగస్వామి, సిబ్బంది వెంకట్రావు, అబ్దుల్ ఖాదర్ సయ్యద్ జిలానీ తదితరులు పాల్గొన్నారు.