నవాబ్‌పేట, మార్చి 31 : ఉమ్మడి జిల్లాలోనే పేరుగాంచిన ఫత్తేపూర్ మైసమ్మ ఆలయాన్ని సకల సదుపాయాలతో అభివృద్ధి చేసి.. టూరిజం హబ్‌గా మారుస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పే ర్కొన్నారు. మండలంలోని మైసమ్మ ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణమంతా తిరిగి పరిశీలించారు. అటవీ, దేవాదాయ శా ఖల అధికారులతో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే పేరొందిన మైసమ్మ ఆలయాన్ని టూరిజం, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధికి అడ్డంకిగా మారిన అటవీశా ఖ భూములను ప్రభుత్వం దేవాదాయ శాఖకు అప్పగించిందని తెలిపారు.
మైసమ్మ ఆలయ భూమి అ టవీ శాఖలో ఉండటంతో గతంలో అభివృద్ధి జరగలేద ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పోడు భూము ల్లో భాగంగా అటవీ శాఖ భూమిని దేవాదాయ శాఖకు అప్పగించినట్లు తెలిపారు. 24 ఎకరాల భూమిని వెంకటాపూర్ వద్ద అటవీ శాఖకు అప్పగించి, 6.5 ఎకరాల భూమిని దేవాదాయ శాఖకు అప్పగించినట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం 6 అంతస్థుల్లో హోటల్ నిర్మాణం, ఒకే సారి సుమారుగా 1200 మంది పూజలు చేసుకునేలా వసతి సౌకర్యాలు, షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతామని వెల్లడించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వినతి మేరకు ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకే ఆలయాలు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని తెలిపారు. ఫత్తేపూర్ ఆలయ అభివృద్ధికి అంచనాలు తయారు చేసి అందజేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. మంత్రి వెంట పర్యాటక శాఖ ఎండీ మనోహర్, జిల్లా అటవీ అధికారి సత్యనారాయణ, జిల్లా పర్యాటక అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ చైర్మన్ లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ సంతోశ్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ చందర్‌నాయక్, ముడా డైరెక్టర్ గండు చెన్నయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఇందిరాదేవి, మాజీ ఎంపీపీ శీనయ్య, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, గోపాల్, కృష్ణయ్య, ఈవో మదనేశ్వర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.