
మహబూబ్‌నగర్: నిరుపేదలకు ఎల్లప్పుడూ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జల్లా కేంద్రంలోని మంత్రి స్వగృహం నందు హన్వాడ మండలం గోండ్యాల్ కి చెందిన గౌరమ్మకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి రూ.2లక్షల చెక్కును వారి కుటుంబసభ్యులకు మంత్రి అందజేశారు. ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ ఆరోగ్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వడ్ల శేఖర్, తదితరులు ఉన్నారు.
పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం
హన్వాడ: రాష్ట్రలో ఎక్కడైనా పేద ప్రజలకు కార్పోరేట్ విద్య అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బు ధవారం జిల్లా కేంద్రంలో హన్వాడ మండలం గొండ్యాల గ్రామానికి చెందిన శేఖర్ సీఎం సహాయనిధి నుంచి రూ.2లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటయ్య, ఎంపీటీసీ శేఖర్ గ్రామస్థులు పాల్గొన్నారు.